HomeNewsప్రజాపక్షం పత్రిక ఆధ్వర్యంలో అన్నార్థులకి మాస్క్ లు, 25 కిలోల బియ్యం పంపిణి

ప్రజాపక్షం పత్రిక ఆధ్వర్యంలో అన్నార్థులకి మాస్క్ లు, 25 కిలోల బియ్యం పంపిణి

ప్ర‌జాప‌క్షం/గోదావ‌రిఖ‌ని : కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు, లాక్ డౌన్ లో అన్నార్థులు ఆకలికి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త గ ప్రజాపక్షం దిన పత్రిక ఆధ్వర్యంలో సోమవారం రామగుండం లోని తబిత ఆశ్రమం లో ఎస్. ఐ శైలజ చేతులమీదతుగా వాషెబెల్ మాస్క్ లతో పాటు 25 కిలోల బియ్యం ని పంపిణి చేయడం జరిగింది. ఎస్. ఐ మేడం పిల్లలకు మాస్క్ లను తొడిగారు. అనంతరం పిల్లలతో కాసేపు గడిపి పిల్లలకి ఆశ్రమ నిర్వాహకులకు కరోనా వైరస్ గురించి, అది దరిచేరకుండా ఉండేందుకు పాటించాల్సిన జార్గ్రతల గురించి వివరించారు. అలాగే పిల్లలను ఎవ్వరిని కూడా ఆశ్రమ నుండి బయటకి రావొద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకుంటూ ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని తెలిపారు. ఆశ్రమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రాంగా ఉంచుకోవాలని ఆశ్రమ నిరవకులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ఎస్. ఐ. శైలజ, ప్రజాపక్షం పెద్దపల్లి బ్యూరో గౌస్ పాషా,ప్రజాపక్షం గోదావరిఖని ఇంచార్జి శ్రీకాంత్ యాదవ్, ఉదయ్, ఆశ్రమ నిర్వాహకుడు భూక్యా వీరేందర్ నాయక్, కానిస్టేబుల్స్ లింగాల ప్రభాకర్ తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments