HomeNewsరంగారెడ్డి జిల్లా వార్త‌లు (30-03-2020)

రంగారెడ్డి జిల్లా వార్త‌లు (30-03-2020)

రంగారెడ్డి జిల్లాలో అత్యవసర సేవలకు 13 అంబులెన్స్ లు
-ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవలకు(మెడికల్ ఎమర్జెన్సీ)కి సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్,సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్సులను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సహకారంతో సైబరాబాద్ పోలీసులు,సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్,ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో అంబులెన్సులు ప్రారంభించినట్లు సీపీ.సజ్జనార్ తెలిపారు.
రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలలో ఇప్పటివరకూ 656 మందికి ప్రతీరోజు కిడ్నీ డయాలసిస్ కోసం అంబులెన్స్ లను వినియోగిస్తున్నామన్నారు.ఎస్బీ కానిస్టేబుళ్లు స్వయంగా డయాలసిస్ కోసం అప్లై చేసుకున్న పేషంట్లను ఇంటికి వెళ్లి పాసులను అందజేశారన్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ వున్నవారు, ప్రెగ్నెంట్ మహిళలు,సీనియర్ సిటిజెన్స్,ఇతర అవసరాలకు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయాలన్నారు.అదేవిధంగా covidcontrol@gmail.com ఈమెయిల్ చేయవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర రావు,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్,సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ,విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ,బాలానగర్ డిసిపి పద్మజా,ఏడీసీపీ ఎస్బీ గౌస్ మొహియుద్దీన్,సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్,ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్,ఏడీసీపీ క్రైమ్స్ I కవిత,ఏసీపీ మాదాపూర్ శ్యామ్ ప్రసాద్ రావు,ఏసీపీ సంతోష్ కుమార్,సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీనారాయణ,ఎస్సీఎస్సీ వైస్ చైర్మన్ భరణి ఆరోల్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణా ఏదుల,సీటీసీ డాక్టర్లు,ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి పంపిణీ

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్(సొసైటీ), సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లు పేదలు,నిరాశ్రయులు మరియు నిరుపేదలకు భోజన ఏర్పాట్లతోపాటు కిరాణా సామాగ్రిని గ్రౌండ్ పోలీసు సిబ్బంది,ట్రాఫిక్ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు.

ప్రజల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ ఏర్పాటు…..

ప్రజాపక్షం/ తుర్కయంజాల్ : మున్సిపాలిటీ పరిధి ఇంజపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం కోసం రైతులను సంప్రదించి ఇంజపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూరగాయల మార్కెట్ ఆదివారం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ బొక్క రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్ లు, మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని, మార్కెట్ కి వచ్చే ప్రతిఒక్కరు మాస్కులు లేదా చేతి రుమాలు వాడాలని గ్రామ ప్రజలకు విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ మున్సిపల్ సిబ్బంది, నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి , గ్రంధాలయ చైర్మన్ ఏనుగు ఆనంద్ రెడ్డి, గుర్రం ప్రభాకర్ రెడ్డి, బొల్లు నగేష్ , మహమ్మద్ గౌస్ పాషా, మల్లెల జగన్, గోవర్ధన్ , రంగా కృష్ణ గౌడ్, సుంకోజు కృష్ణ చారి, సిల్వెరి శేఖర్, నేత వెంకటేష్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ పేషెంట్ లకు సైబరాబాద్ పోలీసుల సాయం

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డయాలసిస్ అవసరం ఉన్నటువంటి 656 మందికి, సైబరాబాద్ పోలీసు వారు ఇంటింటికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాసులు ఇవ్వడం జరిగింది.
ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని 326 మంది,మేడ్చల్ జిల్లా పరిధిలోని 330 మంది పాసుల కోసం నమోదు చేసుకోగా వారందరికీ సైబరాబాద్ పోలీస్ కోవిడ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాసులను జారీ చేసి సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా ఇంటింటికి వెళ్లి పాసులను చేరవేయడం జరిగింది.
అదేవిధంగా ఇతర అత్యవసర సర్వీసుల కోసం సైబరాబాద్ కోవిడ్-19 కంట్రోల్ రూమ్ కాల్ చేసిన వారికి అవసరమైన సమాచారాన్ని ఇస్తూ,వారికి అవసరమైతే వాహన సదుపాయాన్ని సైతం కల్పించడం జరిగింది.
అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా అడిషనల్ డిసిపి లావణ్య,ఎన్ జె పి గారిని నియమించి,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది.
సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఇతర ప్రాంతాల నుంచి ఆయా సంబంధిత జిల్లాలకు సమాచారం అందిస్తూ వారి సమస్యలను తీర్చడం జరుగుతుంది.

కరోనా నివారణకు విస్తృత చర్యలు

-లాక్డౌన్ ను పాటించాలి
-ఇటుక బట్టీ కార్మికులకు భోజనం సౌకర్యం కల్పిస్తాం
-మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కరోనా మహమ్మారి భారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని,ప్రజలు చేయాల్సిందల్లా లాక్ డౌన్ ను అమలు చేయడేమనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు పట్టణ వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముందుగా పట్టణ ప్రాంతాల్లోనూ, తర్వాత గ్రామాల్లోనూ దీనిని స్ప్రే ల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజలంతా సహకరించి ఇంటి వద్దనే ఉండాలని కోరారు.ప్రతీ రోజూ ఉదయం వేళల్లో నిబంధనలను పాటిస్తూ నిత్యావసర వస్తువులను, కూరగాయలను తెచ్చుకోవాలని సూచించారు.ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలనీ,ప్రతి ఒక్కరి ఆకలిని ప్రభుత్వం తీరుస్తుందని మంత్రి సబితారెడ్డి అన్నారు.జిల్లాలో ఉన్న ఇటుక బట్టి కార్మికులకు నిత్యం భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు.ఎవరూ అదైర్య పడకుండా ఉండాలని కోరారు. కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధత తో ఉందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments